పొంగే కడలి కెరటం ......................పడిపోవుటకాయం....
వీచే గాలి ప్రవాహం ................ఆగిపోవుటకాయం.......
పారే నదీపాయలు ..................కడలి చేరుటకాయం...............
కురిసే మేఘమాలిక ...............మౌనముద్రిక దాల్చేదిఖాయం .............
పొంగినా ...వీచినా ...పారినా ...కురిసినా ...ఆగిపోనిదోకటే ..............................నిజమైన స్నేహం ......! నిజమే.....!
ప్రియ నేస్తమే మన జీవితసమస్తం ..........స్నేహం ఒక స్వేచ్చా విహంగం ...ప్రతి మనిషీ అంతరంగాతరంగం ...ప్రముఖ రచయిత "రాల్స్ వాల్డో ఎమర్సన్ "ఎ ఫ్రెండ్ ఈస్ ఎ పర్సన్ బిఫోర్ హూం ఐ కెన్ థింక్ అలౌడ్ ",అన్నాడు. అంటే ఆలోచన ప్రతి ఒక్కరి హ్రుదయనాదం.అది ఆలోచించే మనిషి సొంత వ్యవహారం .కాని నిజమైన స్నేహితుల ఎదుట మన ఆలోచనల వాల్యుం(శబ్దం)పెంచి ఆలోచించగలం.గుండె చప్పుళ్ళు ను పంచుకోగలం .గుండెలోని బాధల్ని మిత్రుల ఎదుట కుండపోతగా కురిపించి బరువు దించుకోగలం.
బాగుంది.
ప్రత్యుత్తరంతొలగించు