25, జనవరి 2010, సోమవారం

"కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా -నీ బుగ్గ మీద గులాబి రంగు ఎలావచ్చెనో చెప్పగలవా ?" అని డబ్బులేని హీరో పాడే పాటలూ,"దులపర బుల్లోడో......ఈ డబ్బున్న కుర్రోళ్ళ భరతం పట్టి ..." అని బీద హీరోయిన్ పాడే పాటలూ ఇటివలి కాలంలో సినిమాల్లోకనపడటం లేదు .

శృంగార పాటలు వదిలేస్తే ,డబ్బు సంపాదించ వద్దని గానీ ,డబ్బు వుండటం తప్పనిగానీ ,ఇటివలి కాలంలో "ముఖ్యంగా నాయికా నాయకులు " పాడటం లేదు .

మారుతున్న ప్రపంచీకరనానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ?....

20, జనవరి 2010, బుధవారం

పొంగే కడలి కెరటం ......................పడిపోవుటకాయం....

వీచే గాలి ప్రవాహం ................ఆగిపోవుటకాయం.......

పారే నదీపాయలు ..................కడలి చేరుటకాయం...............

కురిసే మేఘమాలిక ...............మౌనముద్రిక దాల్చేదిఖాయం .............

పొంగినా ...వీచినా ...పారినా ...కురిసినా ...ఆగిపోనిదోకటే ..............................నిజమైన స్నేహం ......! నిజమే.....!

ప్రియ నేస్తమే మన జీవితసమస్తం ..........స్నేహం ఒక స్వేచ్చా విహంగం ...ప్రతి మనిషీ అంతరంగాతరంగం ...ప్రముఖ రచయిత "రాల్స్ వాల్డో ఎమర్సన్ "ఎ ఫ్రెండ్ ఈస్ ఎ పర్సన్ బిఫోర్ హూం ఐ కెన్ థింక్ అలౌడ్ ",అన్నాడు. అంటే ఆలోచన ప్రతి ఒక్కరి హ్రుదయనాదం.అది ఆలోచించే మనిషి సొంత వ్యవహారం .కాని నిజమైన స్నేహితుల ఎదుట మన ఆలోచనల వాల్యుం(శబ్దం)పెంచి ఆలోచించగలం.గుండె చప్పుళ్ళు ను పంచుకోగలం .గుండెలోని బాధల్ని మిత్రుల ఎదుట కుండపోతగా కురిపించి బరువు దించుకోగలం.

8, జనవరి 2010, శుక్రవారం

ఎర్రమందారం



నువ్వున్నా ,లేకున్నా నీ భూమి నీకుండాలి .
ఇంకొకడు రాకూడదు .
వాడు వస్తే ,
బతకడానికైనా రావాలి ,లేదా చావడానికైనా రావాలి.
అంతేకానీ,
ఉండిపోవడానికి ,జెండా ఎగరేయడానికి రాకూడదు .

నువ్వున్నతకాలం ఈ భూమి ........ నీ రక్తం ,నీ మాంసం
నువ్వుపోయాక ఈ భూమికి నువ్వు ........రక్తం ,మాంసం .
నీ ప్రాణాన్ని , నీ త్యాగాన్ని నీ భూమి వృధా కానివ్వదు.
మళ్లీ మొలకేత్తుతావ్ ......చూస్తుండు ..
నువ్వు పుట్టి పోయాక మళ్లీ మొలకేత్తుతావ్ ....

కొత్తగా .......నూతనంగా ..........
ఎర్రగా ............విప్లవంగా ............తుపాకీగా ....................






















































































నువ్వుపోయాక ఈ భూమికి నువ్వు ..........రక్తం,మాంసం .

6, జనవరి 2010, బుధవారం

ఐ లవ్ ఇండియా,